
టీటీడీలో వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. వీఐపీ దర్శనాలు ఎల్1, ఎల్2, ఎల్3 లను ఈ రోజు నుంచి పూర్తిగా రద్దు చేస్తున్నట్లు చెప్పారు. రెండు మూడు రోజుల్లో సాఫ్ట్ వేర్ అప్డేట్ చేసిన తర్వాత అధికారికంగా అమలులోకి తీసుకువస్తామన్నారు. అయితే ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామన్నారు.
ఎక్కువ మంది సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎల్1, ఎల్2, ఎల్3 లలో చాలా వరకు బ్లాక్ టికెట్స్ దందా నడుస్తున్నాయని సమాచారం ఉంది. మరికొన్ని రోజుల్లో ఆధారాలతో బయటపెడతాం అని చెప్పిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి