ముంబయిలో టీటీడీ ఆలయం

ముంబయిలో టీటీడీ ఆలయం
  • 10ఎకరాల సువిశాల స్థలంలో ఆలయ నిర్మాణం
  • ఈనెల 21న భూమి పూజ 

ముంబయి: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి ఇవాళ ముంబయి వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లను కలిశారు. ముంబయి మహా నగరంలో టీటీడీ నిర్మించనున్న శ్రీవారి ఆలయ భూమి పూజకు రావాలని సీఎం, డిప్యూటీ సీఎంలను ఆహ్వానించారు. షిండే , ఫడ్నవీస్ లకు టీటీడీ వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. 
ఈనెల 21వ తేదీన ముంబయి నగరంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరగనుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్య నేతలను కలసి ఆహ్వానించగా.. కార్యక్రమానికి హాజరవుతామని సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ తెలిపారు. టీటీడీ నిర్మించనున్న ఆలయానికి మహారాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల భూమి కేటాయించింది. రేమండ్స్ కంపెనీ అధినేత గౌతం సింఘానియా ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చారు.