శ్రీవారి ఆర్జితసేవ టికెట్లు విడుదల చేసిన టీటీడీ

శ్రీవారి ఆర్జితసేవ టికెట్లు విడుదల చేసిన టీటీడీ

శ్రీవారి ఆర్జితసేవ ఆన్‌లైన్‌ టికెట్లు జూన్‌ నెలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ(శుక్రవారం) విడుదల చేసింది. జూన్ నెల కోటా కింద మొత్తం 60,666 శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు విడుదల చేసినట్లు TTD అధికారులు తెలిపారు. ఇందులో సుప్రభాతం టికెట్లు 7,681, తోమాల 130, అర్చన 130, అష్టదళపాదపద్మారాధన 300, నిజపాద దర్శనం టికెట్లు 1,725 విడుదలయ్యాయి. ఆన్‌లైన్ జనరల్ కేటగిరీలో 50,700 టికెట్లు విడుదల చేశారు. ఇందులో విశేష పూజ 1500, కల్యాణం 13,300, ఊంజల్ సేవ 4,200, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 6,600, సహస్రదీపాలంకార సేవ 17,400 టికెట్లు ఉన్నాయి. ఆన్‌లైన్ డిప్ విధానంలో 9,966 టికెట్లు విడుదల చేశారు TTD అధికారులు.