భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల కొండ

భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల కొండ

తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్యూ లైన్లు, కంపార్టుమెంట్లు నిండిపోయాయి. దాదాపు మూడు కిలో మీటర్ల వరకు భక్తులు బారులు తీరారు. దీంతో స్వామివారి ప్రత్యేక ప్రవేవ దర్శనానికి 7 గంటలకు పైగా సమయం పడుతోంది. రష్ ఎక్కువగా ఉండడం, దర్శనానికి సమయం పడుతుండడంతో క్యూలైన్లలో ఇబ్బందులు పడుతున్నారు జనం.

క్యూ లైన్లలో ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్దులకు అవస్థలు తప్పడంలేదు. అన్నప్రసాదాలు, తాగునీరు కూడా అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ఎంతో దూరం నుంచి స్వామివారి దర్శనానికి వస్తే…కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. మరోవైపు దర్శనానికి ఆలస్యం కావడంతో సరైన సమయానికి గదులు ఖాలీ కాక…అద్దె గదులు దొరకడం కూడా కష్టంగా మారింది. దీంతో రోడ్ల పక్కన, ఫుట్ పాత్ ల మీదే సేదతీరుతున్నారు భక్తులు