తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్... శ్రీవాణి ఆన్ లైన్ బుకింగ్ విధానంలో కీలక మార్పులు..

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్... శ్రీవాణి ఆన్ లైన్ బుకింగ్ విధానంలో కీలక మార్పులు..

కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవాణి ఆన్ లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో కీలక మార్పులు చేసింది టీటీడీ. ఇవాళ్టి ( మార్చి 27 ) నుంచి ఏకకాలంలో శ్రీవాణి ట్రస్ట్ కు విరాళంతో పాటు బ్రేక్ దర్శనం టికెట్ కు పేమెంట్ చేసే సౌకర్యం అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది టీటీడీ. రూ. 10 వేలు విరాళంతో పాటు బ్రేక్ దర్శనం టికెట్ రూ. 500 ను ...రెండూ కలిపి 10,500 ఒకేసారి చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. పేమెంట్ గేట్ వే లావాదేవీలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పగించినట్లు తెలిపింది టీటీడీ.

అంతే కాకుండా.. ఇవాళ్టి నుండి యూపిఐ ద్వారా కూడా పేమెంట్ చేసే సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపింది టీటీడీ. డెబిట్, క్రెడిట్ కార్డ్ లు, నెట్ బ్యాంకింగ్ తో పాటు యూపీఐ చెల్లింపు సదుపాయం అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది టీటీడీ. భక్తుల సౌకర్యార్థం ఆఫ్ లైన్ జారీని నిలిపివేసి‌...జనవరి 9వ తేదీ నుండి శ్రీవాణి ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది టీటీడీ.

కరెంట్ డే కోటా క్రింద రోజుకు 800 టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేస్తోంది టీటీడీ.ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో టిక్కెట్లు విడుదల చేస్తోంది. ఒక ఐడి పైన ఒకసారి టికెట్ పొందితే ...వారం పాటు టికెట్ పొందడానికి వీలులేకుండా ఆంక్షలు విధించింది. ఇంతకాలం శ్రీవాణి ట్రస్ట్ కు ఫర్థర్ డేట్ లో విరాళమిచ్చి...కరెంట్ బుకింగ్ లో టిక్కెట్లు పొందిన భక్తులు తాజా మార్పుతో కరెంట్ డే కు విరాళమిచ్చి ఏరోజుకారోజు శ్రీవాణి దర్శనం టిక్కెట్లను భక్తులు పొందే అవకాశం ఉంది. శ్రీవాణి కరెంట్ బుకింగ్ లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ఎప్పటికప్పుడు సాంకేతిక మార్పులు చేస్తున్నట్లు తెలిపింది టీటీడీ.