ఒంటిమిట్ట రామయ్య కల్యాణానికి 85 వేల శ్రీవారి లడ్డూలు.. 

ఒంటిమిట్ట రామయ్య కల్యాణానికి 85 వేల శ్రీవారి లడ్డూలు.. 

కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయంలో వైభవంగా జరగనున్న సీతారాముల కల్యాణోత్సవానికి టీటీడీ భారీ ఎత్తున శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని సిద్ధం చేసింది. భక్తుల కోరిక మేరకు తిరుమల శ్రీవారి దివ్య ప్రసాదమైన 85 వేల లడ్డూలను ఆదివారం ( మార్చి 29 ) ప్రత్యేక వాహనాల్లో ఒంటిమిట్టకు పంపించారు. ఇందుకు సంబంధించిన ప్యాకింగ్ ప్రక్రియలో సుమారు 300 మంది శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరిల పర్యవేక్షణలో ఐదు గంటల పాటు అప్రమత్తంగా ప్యాకింగ్ ప్రక్రియ అత్యంత క్రమశిక్షణతో జరిగినట్లు తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటలకే ప్రారంభమైన ఈ ప్యాకింగ్ పనులు మధ్యాహ్నం 1 గంట వరకు విరామం లేకుండా కొనసాగాయని... 200 మంది మహిళా సేవకులు, 100 మంది పురుష సేవకులు కలిసి లడ్డూలను ప్యాక్ చేసి, బాక్సులను వాహనాల్లోకి లోడ్ చేశారని తెలిపారు.

►ALSO READ | TTD Update:  తిరుమలలో ( మార్చి 21–27) రికార్డు స్థాయిలో అన్న ప్రసాద వితరణ

​ఏప్రిల్ 1న శ్రీవారి లడ్డూల పంపిణీ

ఏప్రిల్ 1న ఒంటిమిట్టలో కన్నులపండువగా జరగనున్న సీతారాముల కల్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. శ్రీవారి సేవకులు ఎంతో నిష్ఠతో శ్రమించి ప్యాకింగ్ పనులను సకాలంలో పూర్తి చేసినట్లు వెల్లడించారు అధికారులు.

ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీవారి సేవా సదన్ సిబ్బంది కూడా పాల్గొని, రవాణా ఏర్పాట్లను సమన్వయం చేశారని... ఏటా ఒంటిమిట్ట కల్యాణానికి తిరుమల నుండి లడ్డూలను పంపడం ఒక సంప్రదాయంగా వస్తోందని తెలిపారు అధికారులు.