జమ్ము, వారణాసిలో శ్రీవారి ఆలయాలు

జమ్ము, వారణాసిలో శ్రీవారి ఆలయాలు

జమ్ము, వారణాసిలో శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. దీనికి సంబంధించిన వివరాలను తెలిపారు TTD ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌. జమ్ము ప్రభుత్వం ఏడు ప్రాంతాలను ప్రతిపాదించిందన్నారు. నాలుగు ప్రాంతాలు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ ఏడాదిలోనే జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. జనవరిలో తిరుమలలోని స్వామివారిని 22.9 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారన్నారు. 1.01 కోట్ల లడ్డు ప్రసాదం  సేల్ చేశామని తెలిపారు. జనవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.94.9 కోట్లు వచ్చినట్లు చెప్పారు అనిల్ సింఘాల్.