తిరుమలలో భక్తుల కష్టాలు

తిరుమలలో భక్తుల కష్టాలు

తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఉచిత దర్శనం కోసం 13 గంటలకుపైగా పడిగాలు పడుతున్నారు. నిన్న రాత్రి 7 గంటలకు వచ్చిన భక్తులకు ఇవాళ ఉదయం 10 గంటల వరకు దర్శనం కాలేదు.

కనీసం దర్శనం ఎప్పుడు అవుతుందో కూడా చెప్పడం లేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం వరకు ఉచిత దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు టీ, పాలు కూడా ఇవ్వలేదన్నారు. ఓవైపు వర్షం, మరోవైపు చలిగాలులతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రమైన చలిగాలులు వణికిస్తుంటే భక్తులు ఇబ్బందిపడుతున్నారన్న విషయాన్ని గుర్తించకపోవడం దారుణమన్నారు. 

భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయంలో తిరుమల దేవస్థానం అధికారుల తీరును నిరసిస్తూ..ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకోకుండనే వెనుదిరిగి  వెళ్లిపోయారు.