తెలంగాణ ఆవిర్భావం ఒక చరిత్ర: కాసాని జ్ఞానేశ్వర్

తెలంగాణ ఆవిర్భావం ఒక చరిత్ర: కాసాని జ్ఞానేశ్వర్

తెలంగాణ ఆవిర్భావం ఒక చరిత్ర..తెలంగాణ రావడానికి, ఇవ్వడానికి అసెంబ్లీ నుండి మొట్టమొదటి ప్రతిపాన ఇచ్చింది చంద్రబాబు అని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వ్యాఖ్యానించారు. జూన్ 2వ తేదీ శుక్రవారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆయన పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన జ్ఞానేశ్వర్..60 సంవత్సరాల తర్వాత తెలంగాణ రావడం సంతోషంగా ఉందన్నారాయన. తెలంగాణ ప్రజలు, యువత కలలు కన్నా తెలంగాణ మనకు రాలేదని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చిందని వెల్లడించారు. ఆనాడు తెలంగాణ రాలేదని యువత ఆత్మ బలిదానాలు చేసుకున్నారని గుర్తు చేశారు.

తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేయాలో అది చేయలేదని ఆరోపించారు జ్ఞానేశ్వర్. యువతకి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు.. కానీ పెద్ద స్థాయిలో తెలంగాణ సచివాలయాన్ని నిర్మించారని ఆయన నిలదీశారు. రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు కానీ బీఆర్ఎస్ లీడర్ల దగ్గర డబ్బులు ఉన్నాయని విమర్శించారు.తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ రావాల్సిందే..ఇలాంటి దుష్ట ప్రభుత్వం పోవాలని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం యువత ఆలోచించాల్సిన సమయం వచ్చిందని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు.