సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘టక్కర్’. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇప్పటికే టీజర్‌తో ఇంప్రెస్ చేసిన టీమ్, తాజగా ‘కయ్యాలే’ అనే పాటను విడుదల చేసింది. నివాస్ కె ప్రసన్న కంపోజ్ చేయగా, నిరంజనా రామన్ ఎంతో జోష్‌గా పాడిన ఈ పాటకు కృష్ణ కాంత్ రాసిన లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి.
సిక్కిం లోని బుద్ధ పార్క్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ‘మన రూటు సెపరేటు.. కలర్‌ఫుల్ కొత్త రూటు వేసేద్దామా..’ అంటూ హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌ను, సమాజం పట్ల ఆమెకున్న అభిప్రాయాలను తెలియజేసేలా ఈ పాట సాగింది. అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విఘ్నేష్ కాంత్ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈనెల 26న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.