ప్రభుత్వం మెడలు వంచడానికైనా సిద్ధం

ప్రభుత్వం మెడలు వంచడానికైనా సిద్ధం

అనేక సంవత్సరాల నుండి ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. రాష్టంలో 10 వేల నుంచి 4 లక్షల వరకు ప్రైవేట్, కార్పొరేట్ ఫీ వసూల్ చేస్తుంది. ఫీజుల నియంత్రనపై ఇప్పటికే పలు నిరసన కార్యక్రమాలు చేపట్టినా ఫలితం శూన్యం. ఈ నేపథ్యంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజులపై నియంత్రణ చట్టం తేవాలని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో TUDF, SFI, DYFI, AIDWA ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. రామన్ మేగాసిసే అవార్డు గ్రహిత శాంతాసిన్హా, పలువురు ప్రములు, వక్తలు ఈ సదస్సులో పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆకునూరి మురళి మాట్లాడుతూ.. విద్య, వైద్యం, పేదరిక నిర్మాణం, ఆన్ఎంప్లాయోమెంట్ మీద సీఎం ఎవరిని మాట్లాడనివ్వరు అని విమర్శించారు. ప్రైవేట్ విద్యాలయాలు ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అవుతుంది.. అయినా ఇంకా లీట్రసీలో గ్రోత్ మాత్రం చాలా స్లో ఉందన్నారు. పాలక దూర్మార్గులు డబ్బును ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు. చాలా వరకు రాష్టంలో ప్రభుత్వ పాఠశాలలో సరైన వసతులు లేవు. చదువు బిజినెస్ కాదు.. ఎడ్యుకేషన్ కి చాలా చట్టాలు వున్నాయి.. కానీ మంత్రులే చదువును బిజినెస్ చేస్తున్నారని మండిపడ్డారు.

మన దగ్గర టీచర్ ఒక పొలిటికల్ యానిమల్..యథా రాజా తథా ప్రజా.. ముఖ్యమంత్రి తీరే ప్రభుత్వం కూడా ఉందని మురళి వ్యాఖ్యానించారు. మన బడ్జెట్ నామ్ కే వాస్తే వుంటది.. బడ్జెట్ కు సంబంధం లేకుండా ఖర్చు పెడ్తారని తెలిపారు. బడ్జెట్ అనేది బోగస్ అని దుయ్యబట్టారు. మన ఊరు మన బాడీ అంటూ గొప్పలు చెప్పుకొన్నారు. కానీ నామినల్ బడ్జెట్ ఒక లక్ష కూడా పెట్టాలె.. అసలు ఒక పదం కూడా బడ్జెట్ లో లేదన్నారు. నేర్చుకొనే దశని జీరో చేశారు మన దగ్గర.. దేశ భవిష్యత్తు ఎడ్యుకేషన్ పై ఆధారపడి ఉంటుంది అన్నారు. రోజు రోజుకి విద్య ప్రైవేటీకారణ అవుతుందని ఆరోపించారు. 

ప్రభుత్వ స్కూల్స్ ల్లో విద్యార్థులు పెగుతున్నారని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. పెదరికం పెరుగుతుంది కనుక ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్నారని మురళి మండిపడ్డారు. దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. దేశం ఏం బాగుపడుతుంది..! అన్యాయాలు, అక్రమాలు, ఆఘాయిత్యాలు పెరుగుతున్నాయి.. ఇలా చూస్తూ మౌనంగా ఉండకుండదు. అందరూ మాట్లాడాలి అన్నారు. గొంతు పెంచలి ఎడ్యుకేషన్ పై మరో మిల్యన్ మార్చ్ తీసుకువరావాలని ఆకునూరి మురళి పిలుపునిచ్చారు.

టీయుడిఎఫ్ ప్రధాన కార్యదర్శి డీజీ నర్సింహా రావ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూల్స్ లో నాణ్యనమైన విద్య,సౌకర్యలు లేవని ఆరోపించారు. ప్రభుత్వం వచ్చి రేడు దాఫలు అయినా కేజీ టూ పీజీ ఊసే లేదు. తెలుగు రాష్టాలలో ఉన్నట్టు అడ్మిషన్ ఫీ ఏ రాష్టంలో లేదని విమర్శించారు. ప్రైవేట్ స్కూల్స్ ను నియత్రించాలి.. ప్రభుత్వ స్కూల్స్ లో నాణ్యత పెంచాలని డిమాండ్ చేశారు. జీవో నెం.42,91 ఎక్కడ అమలు అవ్వట్లేదు.. ఇష్టను సారంగా ప్రైవేట్ స్కూల్స్ డబ్బులు వసులు చేస్తుందని మండిపడ్డారు. వచ్చే విద్య సంవత్సరం వరకు ఫీజులు నియంత్రణ చేయాలి.. లేని పక్షంలో ప్రభుత్వ మెడలు వంచడానికైనా సిద్ధమన్నారు. జిల్లా స్థాయిలో ఫీజుల నియంత్రణకై డీఎఫ్ఆర్సీ కమిటిలు ఏర్పాటు చేయాలని డీజీ నర్సింహా రావ్ సూచించారు.

శాంత సిన్హా మాట్లాడుతూ.. ప్రైవేట్ స్కూల్స్ నియంత్రణపై రిజల్యూషన్ తీసుకు రావాలి అన్నారు. ప్రైవేట్ స్కూల్స్ అనేది దోచుకునే పెద్ద దోపిడీ వ్యవస్థ. ప్రైవేట్ వ్యవస్థ అసమానతకు దారి తీసేది. విద్య వల్ల సమాజం, దేశం మారుతుంది. అలాంటి మార్పు దోపిడీ వ్యవస్థ ద్వారా రాదు అని తెలిపారు. సమానత్వం కావాలంటే ప్రైవేట్ స్కూల్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బాధ్యత తీసుకువాలంటే ప్రైవేట్ పై నియంత్రన తీసుకురావలి. ప్రైవేట్ స్కూల్స్ అంటే కమర్షియెల్.. ప్రాఫిట్, బిసినెస్.. చట్టం ప్రకారం చదువు ప్రాఫిట్ కాదు. చట్ట ప్రకారం ప్రైవేట్ స్కూల్స్ నడపాలి. లెకపోతే రద్దు చేయాలి పేర్కొన్నారు. విద్య విధానంలో యుద్ధం జరుగుతుంది..అందుకు నిదర్శనమే IIIT బాసర అని శాంత సిన్హా వ్యాఖ్యానించారు.