3,219 కోట్లతో పట్టణాల్లో సౌలతులు

3,219 కోట్లతో పట్టణాల్లో సౌలతులు
  • టీయూఎఫ్‌ఐడీసీ వెల్లడి 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో రూ.3,219 కోట్ల నిధులతో అన్ని రకాల సౌలతుల నిర్మాణాలు చేపట్టామని తెలంగాణ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్షర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (టీయూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐడీసీ) వెల్లడించింది. ఈ మేరకు అధికారులు  శనివారం ప్రకటన విడుదల చేశారు. 117 పట్టణాల్లో  రూ.3,809 కోట్లతో పనులు చేపట్టేందుకు అనుమతులు రాగా.. అందులో రూ.3,219 కోట్ల విలువైన పనులు ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడాక  పట్టణాల  సంఖ్య 142కు పెరిగిందన్నారు.  ఆ క్రమంలో  పెంచిన ఆయా పట్టణాలు, నగరాల్లో ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం 2014లో తమ సంస్థను ప్రారంభించిందని పేర్కొన్నారు.  బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు సమీకరించి అభివృద్ధి పనులు చేస్తున్నామని వివరించారు. 

ఎక్కడెక్కడ ఎన్ని నిధులంటే..!

రూ.72.68 కోట్లతో సిద్దిపేటలో అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైనేజీ పనులు, సిరిసిల్లలో తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు రూ.75.76 కోట్లు, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డ్రైనేజీ పనులకు రూ.160.05 కోట్లు, సూర్యాపేటలో డ్రైనేజీ పనులకు రూ.81.41 కోట్ల నిధులు కేటాయించి పనులు  చేపట్టామని అధికారులు చెప్పారు. మున్సిపాలిటీల్లో ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్టీపీల నిర్మాణానికి రూ.50 కోట్లు, నాలుగు అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అథారిటీలకు రూ.40 కోట్లతో పాటు రూ.109.24 కోట్లతో ఇతర పనులు చేపట్టామని తెలిపారు.