వాషింగ్టన్: టెక్ దిగ్గజం గూగుల్‌పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ తులసి గబ్బార్డ్ పరువునష్టం దావా వేశారు. తన 2020 ఎన్నికల ప్రచార ప్రసారాలపై గూగుల్ వివక్షపూరితంగా వ్యవహరించిందని, నష్టపరిహారంగా తమకు 50 మిలియన్ డాలర్లు (సుమారు రూ.345 కోట్లు) చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు లాస్‌ఏంజెలిస్‌లోని ఫెడరల్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ‘‘జూన్ 27,28 తేదీల్లో సుమారు ఆరు గంటలపాటు మా అడ్వర్టైజింగ్అకౌంట్ను గూగుల్ నిలిపివేసింది. నిధులు సమకూర్చుకునేందుకు, నేరుగా ఓటర్లకు తన మెసేజ్‌ను పంపేందుకు అడ్డుతగిలింది” అని తులసి గబ్బార్డ్ ప్రచార కమిటీ ‘తులసి నౌ ఇంక్.’ ఆరోపించింది. దీంతో తమకు 50 మిలియన్ల డాలర్లకు పైగా నష్టం వాటిల్లిందని పేర్కొంది. ‘‘గబ్బార్డ్ ప్రచారం విషయంలో గూగుల్ ఏకపక్షంగా వ్యవహరించింది. ఎలాంటి నిబంధనలు పాటించలేదు. కంపెనీ తన అధికారంతో రాజకీయ అంశాలపై ప్రభావం చూపుతోంది. ఇది ఆందోళనకర విషయం. ఇదే దారిలో 2020 ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లోనూ గూగుల్ జోక్యం చేసుకునే ప్రమాదం ఉంది” అని తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. తాము పంపిన ఈ–మెయిల్స్‌ను జీ–మెయిల్లో ‘స్పామ్’ ఫోల్డర్‌కు పంపారని ఆరోపించారు. యూఎస్ కాంగ్రెస్ సభ్యురాలిగా ఎన్నికైన తొలి హిందువు తులసి. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. రేసులో ముందున్నారు.
సిస్టమ్‌లో సమస్య వల్లే: గూగుల్
తులసి గబ్బార్డ్ ఆరోపణలపై గూగుల్ స్పందించింది. మోసాలను అరికట్టేందుకు, అడ్వర్టైజర్ అకౌంట్లలో అసాధారణ యాక్టివిటీలు జరిగితే గుర్తించేందుకు తమ ఆటోమేటిక్ సిస్టమ్స్ పని చేస్తాయని తెలిపింది. అయితే సిస్టమ్ తాత్కాలికంగా సస్పెన్షన్‌కు గురైందని, దీంతో సమస్య వచ్చిందని వివరించింది. గబ్బార్డ్ అకౌంట్‌ను వెంటనే పునరుద్ధరించామని చెప్పింది. లీడర్లు ఓటర్లతో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు సహాయపడే యాడ్ ప్రొడక్ట్స్‌ను అందించడాన్ని తామ గర్వంగా ఫీల్ అవుతామని గూగుల్ స్పోక్స్ పర్సన్ జోస్ కాస్టనెడా పేర్కొన్నారు. పక్షపాతం లేకుండా తాము పని చేస్తామని, ఏ పార్టీకి, ఏ పార్టీ ఐడియాలజీకి అనుకూలంగా పని చేయబోమని స్పష్టం చేశారు.
