హైదరాబాద్, వెలుగు: సీడ్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ కేశవులును ఆ పదవి నుంచి తొలగించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సెక్రటరీని ఆదేశించారు. సీడ్ కార్పొరేషన్ లో జరిగిన అవకతవకలపై మంత్రి సీరియస్ అయ్యారు. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. కో ఆపరేటివ్ రిజిస్ట్రార్ హరితకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
