తుమ్మిడి హెట్టి కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా..కేసీఆర్ తుగ్లక్ నిర్ణయాల వల్లే కాళేశ్వరం కుంగింది : మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

తుమ్మిడి హెట్టి కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా..కేసీఆర్ తుగ్లక్ నిర్ణయాల వల్లే కాళేశ్వరం కుంగింది : మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     కాళేశ్వరంతో 4 ఏండ్లలో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఎత్తిపోసింది 100 టీఎంసీల నీళ్లే
  •     20 వేల కోట్ల ప్రాజెక్టును లక్ష కోట్లకు పెంచి ప్రజాధనం లూటీ చేసిన్రు
  •     మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని రైతులకు విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: పదేండ్లలో  ప్రాణహితపై గత బీఆర్‌‌‌‌‌‌ఎస్‌‌ సర్కారు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కట్టి ఉంటే అసలు ఈ కరువు వచ్చేదే కాదని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి మాజీ సీఎం కేసీఆర్ తీసుకున్న తుగ్లక్ నిర్ణయాలే కారణమని  ఆరోపించారు. కేవలం కమీషన్ల కక్కుర్తి కోసమే ప్రాజెక్టును రీడిజైన్ చేసి ధ్వంసం చేశారని ఫైర్​అయ్యారు. శనివారం సెక్రటేరియట్‌‌లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌‌ కుమార్‌‌‌‌రెడ్డితో కలిసి వివేక్‌‌ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం బ్యారేజీలు, నీటి ఎత్తిపోతలపై కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీఆర్‌‌ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారేశారు. చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవడానికే బీఆర్‌‌ఎస్ నేతలు తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

4 పుస్తకాలు చదివి ఇంజినీర్‌‌‌‌లా ఫీలయ్యారు

గతంలో దివంగత నేత గడ్డం వెంకటస్వామి (కాకా) విజ్ఞప్తి మేరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రూ.11 వేల కోట్ల అంచనాతో ప్రారంభించారని మంత్రి వివేక్ గుర్తుచేశారు. ‘‘ఆనాడే తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే.. ఈ రోజు ఎల్‌‌నినో ప్రభావం వల్ల వచ్చిన కరువుతో తెలంగాణ రైతులకు పెద్దగా నష్టం ఉండేది కాదు. కానీ కేసీఆర్ నాలుగు పుస్తకాలు చదివి తానేదో గొప్ప ఇంజనీర్ లా ఫీలయ్యారు. నిపుణుల మాటలను పట్టించుకోకుండా రీడిజైనింగ్ పేరిట తుగ్లక్ నిర్ణయాలు తీసుకున్నారు. కేవలం వేల కోట్ల రూపాయల కమీషన్లు దండుకోవడానికి నాసిరకం నిర్మాణాలు చేపట్టి ప్రాజెక్టును నిలువునా ముంచేశారు. రూ.20 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును ఏకంగా లక్ష కోట్లకు పెంచి తెలంగాణ ప్రజలపై గుదిబండలా మార్చారు’’ అని ఫైర్ అయ్యారు.

700 టీఎంసీలు ఎత్తిపోశారనేది బోగస్..

గత బీఆర్‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ద్వారా 700 టీఎంసీల నీటిని ఎత్తిపోశామంటూ గులాబీ నేతలు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని మంత్రి వివేక్ అన్నారు. అధికారిక లెక్కల ప్రకారం నాలుగేళ్లలో వారు లిఫ్ట్ చేసింది కేవలం 100 టీఎంసీల నీళ్లేనని స్పష్టంచేశారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం, మేడిగడ్డ ప్రారంభించిన తర్వాత మొత్తం 160 టీఎంసీలను పంప్ చేస్తే.. అందులో సుమారు 70 టీఎంసీల నీళ్లను మళ్లీ కిందికి విడిచిపెట్టడంతో వృథాగా సముద్రం పాలయ్యాయని వివరించారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన కట్టడాల నాణ్యతకు, బీఆర్‌‌ఎస్ అవినీతి నిర్మాణాలకు నక్కకు, నాకలోకానికి ఉన్నంత తేడా ఉందని వివేక్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా బ్యారేజీలను 4.5 నుంచి 5 మీటర్ల ఎత్తుతోనే నిర్మిస్తారని, కానీ కేసీఆర్ తనను తాను ఇంజనీర్‌‌గా భావించుకుంటూ 12 నుంచి 15 మీటర్ల ఎత్తుతో రిజర్వాయర్ల తరహాలో నిర్మించి అదనపు ఒత్తిడితో కూలిపోయేలా చేశారని విమర్శించారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎల్లంపల్లిలాంటి మహా ప్రాజెక్టులు దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉన్నాయి. అవి ఎప్పుడైనా కుంగిపోయాయా? కానీ కేసీఆర్ కట్టిన మేడిగడ్డ మాత్రం మూడేండ్లకే ఎందుకు కుంగింది? కమీషన్ల కోసం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నాసిరకంగా బ్యారేజీలు నిర్మించడం వల్లే పిల్లర్లు కుంగిపోయాయి” అని అన్నారు. 

ఎల్లంపల్లిలో అందుబాటులో 20 టీఎంసీలు 
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో నీటి నిర్వహణ చేపడుతోందని మంత్రి వివేక్ తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 20 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సమర్థవంతంగా లోయర్ మానేరు డ్యామ్ (ఎల్‌‌ఎండీ)కు నీటిని మళ్లిస్తున్నా మని చెప్పారు. నదిలో సహజసిద్ధమైన నీటి ప్రవాహం ఉంటే పంపులు స్టార్ట్ చేయడం ఎంతో సులువైన పని అని, అలాంటప్పుడు ప్రవాహాలు వచ్చే చోట వేల కోట్లు ఖర్చు పెట్టి కుంగిపోయే బ్యారేజీలు ఎందుకు నిర్మిం చాల్సి వచ్చిందో బీఆర్‌‌ఎస్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. 

విజిలెన్స్, సీబీఐ, జ్యుడీషి యల్ విచారణలు ముంచుకొస్తుండటంతో జైలుకెళ్లడం ఖాయమని తేలి బీఆర్ఎస్ నేతలు పిచ్చి ప్రేలా పనలు చేస్తున్నారని మండిపడ్డారు.  ప్రభుత్వం నిపుణుల సలహాలతోనే ప్రాజెక్టును కాపాడే ప్రయత్నం చేస్తోం దని చెప్పారు. గత పాలకులు చేసిన చారిత్రక తప్పిదాలు, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న అసత్య ప్రచారాలను రాష్ట్ర ప్రజలు, రైతాంగం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని మంత్రి వివేక్ విజ్ఞప్తి చేశారు.