
భారీ భూకంపం టర్కీని వణికించింది.టర్కీలోని సెంట్రల్ అనటోలియా ప్రాంతంలోని కోన్యా ప్రావిన్స్ లో గురువారం (మే15) సాయంత్రం శక్తివంతమైన భూకంపం సంభవిచింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత5.2గా నమోదు అయింది. ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. భూకంపం కారణంగా ప్రాణనష్టం ఇంకా సమాచారం లేదు. కులుకు ఈశాన్యంగా 14 కి.మీ దూరంలో భూకంపం సంభవించిందని ఇరాన్‌కు చెందిన మెహర్ వార్తా సంస్థ తెలిపింది.
God is real - Earthquake in Turkey🇹🇷 pic.twitter.com/HzhN5nGCGN
— desi sigma (@desisigma) May 15, 2025
యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1.51 గంటల సమయంలో 78 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. కైరో, ఈజిప్ట్, ఇజ్రాయెల్, లెబనాన్, టర్కీ, జోర్డాన్‌లలో కూడా ప్రకంపనలు సంభవించాయి. బుధవారం ఉదయం గ్రీస్‌లోని ఫ్రై సమీపంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత ఇది జరిగింది.
గత నెలలో కూడా ఇస్తాంబుల్ తీరంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది టర్కిష్ మహానగరంలోని స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ప్రాణ నష్టం జరగలేదు. అయితే భయంతో భవనం అంతస్తుల పైనుంచి దూకి 151 మంది గాయపడ్డారు.
Felt #earthquake REVISED - M 5.2 CENTRAL TURKEY pic.twitter.com/lxSj88b7HU
— SSGEOS (@ssgeos) May 15, 2025