
భారత్,పాక్ మధ్య ఉద్రిక్తతల క్రమంలో టర్కీ, పాకిస్తాన్ కు సాయం చేసిందని ఇప్పటివరకు అనుమానాలు మాత్రమే ఉండేది..ఇప్పుడు సాక్ష్యాలుగా కూడా దొరికాయి. ఓపక్క ఉగ్రవాదులే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహిస్తుంటే..మరో పక్క పాకిస్తాన్ కు టర్కీ ఆయుధాలు అందించి భారత్ పై దాడి చేసేందుకు సహకరించిందనడానికి కూలిన టర్కీ డ్రోన్లే నిదర్శనం..అంతేకాదు టర్కీ సైనిక సహకారం అందించింది అనడానికి ఆపరేషన్ సిందూర్లో మృతిచెందిన ఇద్దరు టర్కీష్ కార్యకర్తలేసాక్ష్యం.
ఆపరేషన్ సిందూర్ లో ఇద్దరు టర్కిష్ సైనికులు చనిపోయారు. భారత్ పై దాడికి పాకిస్తాన్ కు 350 కి పైగా డ్రోన్లను అందించిందని, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ పై డ్రోన్ దాడులు చేసేందుకు పాకిస్తాన్ ఆర్మీ అధికారులకు టర్కీ సలహాదారులు సహాయం చేశారని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
భారత్ పై బేరక్తర్ TB2, YIHA డ్రోన్లు పాకిస్తాన్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. భారత సైనిక స్థావరాలను, కాన్వాయ్ లను బెదిరించేందుకు, కామికేజ్ దాడులకు ఈ డ్రోన్లను వినియోగించినట్లు సమాచారం.
పాకిస్తాన్ తో టర్కీ గత కొన్నేళ్లుగా వ్యూహాత్మక రక్షణ సంబంధాలను కొనసాగిస్తోంది. ఇటీవలి కాలంలో అవి బాగా బలపడ్డాయి. టర్కీ ప్రభుత్వం కీలకమైన సైనిక హార్డ్‌వేర్‌ను సరఫరా చేయడమే కాకుండా పాకిస్తాన్ సైన్యానికి శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే పాకిస్తాన్ భారత్ పై డ్రోన్ దాడికి టర్కీ సహకరించిందని ఆందోళనలు చెలరేగాయి. దేశవ్యాప్తంగా టర్కీని బహిష్కరించాలి అని ఉద్యమం సాగింది. టర్కీ చర్యలు భారత ప్రయోజనాలను దెబ్బతీస్తుందని వాదనలు వినిపించాయి.
భారత్ నుంచి సాయం పొంది..
కోవిడ్-19 తర్వాత టర్కీకి భారత ఎగుమతులను పెంచింది. టర్కీ తన రక్షణ ఉత్పత్తికి సాయం చేసింది. అల్యూమినియం, ఆటో భాగాలు, విమానాలు, టెలికాం పరికరాలు ,విద్యుత్ యంత్రాలు ,పరికరాలతో సహా టర్కీకి ఎగుమతి చేసింది.. అయితే అదే భారత్ పై దాడికి వినియోగించారని వార్తలు వినిపిస్తున్నాయి. వేగవంతమైన డ్రోన్ ఉత్పత్తి వెనుక ఉన్నాయని ఈ ఎగుమతులు ఉన్నట్లు తెలుస్తోంది.
మే7,8 తేదీల మధ్య రాత్రి సమయాల్లో పాకిస్తాన్ సైన్యం ఉత్తర ,పశ్చిమ సరిహద్దులలోని భారత సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడులకు 300–400 డ్రోన్లను వినియోగించింది. వీటిని టర్కీ సాయం చేసినట్లుగా వ్యక్తమయిన అనుమానాలు కల్నల్ సోఫియా ఖురేషి మాటలతో నిజమే అనిపిస్తోంది.
"డ్రోన్ల శిథిలాల గురించి ఫోరెన్సిక్ దర్యాప్తు జరుగుతోంది. ప్రైమరీ రిపోర్టులు అవి టర్కిష్ అసిస్‌గార్డ్ సోంగర్ డ్రోన్లు అని చెబుతున్నాయని’’ అని కల్నల్ సోఫియా ఖురేషి ఆపరేషన్ సిందూర్ గురించి విలేకరుల సమావేశంలో చెప్పారు.