
హైదరాబాద్: టీవీ నటుడు మధు ప్రకాష్ భార్య భారతి ఆత్మహత్య కేసులో రాయదుర్గం పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతడికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని.. ఆమె పరిచయం అయినప్పటి నుంచి తన కూతురును మధు ప్రకాష్ నిర్లక్ష్యం చేస్తున్నాడని భారతి తల్లి ఆరోపించారు. అదనపు కట్నం కోసం నిత్యం తమ కూతురిని మధు ప్రకాష్ వేధించేవాడని, వరకట్న వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందని భారతి తల్లిదండ్రులు రాయదుర్గం పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో అదనపు కట్నం వేధింపుల కేసులో రాయదుర్గం పోలీసులు మధు ప్రకాష్ ను అరెస్ట్ చేశారు.