పోక్సో కేసులో డ్రైవర్​కు 20 ఏళ్ల జైలు. . లక్ష జరిమానా

పోక్సో కేసులో  డ్రైవర్​కు 20 ఏళ్ల జైలు. . లక్ష జరిమానా

మెదక్ టౌన్, వెలుగు: పోక్సో కేసులో లారీడ్రైవర్​కు ఇరవై ఏళ్ల జైలుశిక్ష, రూ. లక్ష  జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద తీర్పునిచ్చారు. సోమవారం కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని తెలిపారు. హైదరాబాద్​లోని సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన కొండా వెంకటేశ్​అలియాస్ ​కల్యాణ్​అనే వ్యక్తి వృత్తిలో భాగంగా లారీ నడుపుతూ మెదక్​జిల్లా పాపన్న పేట ఏరియాకి వచ్చాడు.

అక్కడ ఒంటరిగా కనిపించిన బాలికపై అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించాడు. స్థానికులు గమనించి అతడిని పోలీసులకు పట్టించారు.  బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి సాక్ష్యాలతో నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా జడ్జి శిక్ష విధించారని తెలిపారు.