నేను మోదీకి పెద్ద ఫ్యాన్ : ఎల‌న్ మ‌స్క్

నేను మోదీకి పెద్ద ఫ్యాన్ : ఎల‌న్ మ‌స్క్

ప్రధాని నరేంద్ర మోదీతో ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ భేటీ అయ్యారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీను న్యూయార్క్‌లోని లొట్టే న్యూయార్క్‌ ప్యాలెస్‌లో ట్విట్టర్‌ సీఈవో, టెస్లా అధినేత ఎలోన్‌ మస్క్‌  కలిశారు. వివిధ అంశాలపై చర్చించానని మస్క్ వివరించారు. ఈ భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని మోదీ కోరారని.. అందుకు తాను సానుకూలంగా స్పందించానని మస్క్ చెప్పారు. ప్రపంచంలోని అన్ని దేశాలకంటే భారత్‌లోనే ఉద్యోగ, వ్యాపారంతో పాటు..అనేక రంగాల్లోనూ ఎక్కువ అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని మస్క్ అభిప్రాయపడ్డారు.  భారతదేశ భవిష్యత్తు గురించి తాను చాలా ఉత్సాహంగా ఉన్నానన్నారు. 

నేను మోదీ ఫ్యాన్ ని..

 తాను ప్రధాని మోదీకి పెద్ద ఫ్యాన్ అని ఎలన్ మస్క్ చెప్పారు. వచ్చే ఏడాది తాను భారత్ వస్తానని తెలిపారు.  ప్రధానమంత్రి మోదీ భారతదేశ అభివృద్ధి గురించి శ్రద్ధ వహిస్తారన్నారు. పెట్టుబడులు పెట్టడానికి తమను ఎంతగానో ప్రోత్సహిస్తారని మస్క్ తెలిపారు. 

ఆనందంగా ఉంది...

ఎలన్ మస్క్ను కలవడం ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీట్వీట్ చేశారు. శక్తి నుంచి ఆధ్మాత్మికతకు సంబంధించిన పలు అంశాలపై చర్చించామన్నారు. ట్విట్టర్ సీఈవోతో  వివిధ అంశాలపై చర్చించామని పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, అమెరికా  ప్రథమ మహిళ జిల్ బిడెన్ ఆహ్వానం మేరకు  ప్రధాని మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ (జూన్ 21) ఐక్యరాజ్య సమతిలో జరిగే ప్రపంచ యోగా దినోత్సవేడుకలకు మోదీ నాయకత్వం వహింస్తారు. జూన్ 22న మోదీ గౌరవార్థం జో బిడెన్ దంపతులు డిన్నర్ ఇవ్వనున్నారు.