మార్కెట్లోకి టూ బ్రదర్స్ ఆర్గానిక్ ప్రొడక్టులు

మార్కెట్లోకి టూ బ్రదర్స్ ఆర్గానిక్ ప్రొడక్టులు

హైదరాబాద్, వెలుగు: టూ బ్రదర్స్​ ఆర్గానిక్​ ఫామ్స్​ తన ఉత్పత్తులను హైదరాబాద్​లోని రత్నదీప్​ స్టోర్స్​లో విడుదల చేసింది.  ఏ2 ఆవు నెయ్యి, ఖాప్లీ గోధుమ పిండి, గానుగ నూనె​, రసాయన రహిత బెల్లం వంటి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించారు. 

పాతకాలపు ధాన్యాలను, సంప్రదాయ పద్ధతుల్లో తయారైన ఆహారాన్ని  అందించడమే లక్ష్యమని సంస్థ తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్​లోని రత్నదీప్​ స్టోర్లలో ఇవి అందుబాటులో ఉంటాయి.