ప్యారడైజ్ ఫ్లైఓవర్పై యాక్సిడెంట్ .. భారీగా ట్రాఫిక్ జామ్

ప్యారడైజ్ ఫ్లైఓవర్పై యాక్సిడెంట్ .. భారీగా ట్రాఫిక్ జామ్

పద్మారావు నగర్, వెలుగు: సికింద్రాబాద్ ప్యారడైజ్ ఫ్లై ఓవర్ వద్ద శనివారం రెండు కార్లు ఢీకొనడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. తొలుత ఓ ఇన్నోవా కారు వేగంగా దూసుకువెళ్లి డివైడర్ ను ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక వస్తున్న స్విఫ్ట్ కారు డివైడర్‌పైకి దూసుకొచ్చి ఆగి ఉన్న ఇన్నోవాను ఢీకొట్టింది. 

ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లకు గాయాలు కాగా, రోడ్డుకు ఇరువైపుల ట్రాఫిక్ స్తంభించింది. స్థానికుల సమాచారంతో ట్రాఫిక్ పోలీసులు భారీ క్రేన్లతో రోడ్డుకు అడ్డంగా ఉన్న రెండు కార్లను తొలగించారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు దాదాపు రెండు గంటల సమయం పట్టింది.