సూర్యాపేటలో రెండు కార్లు దగ్థం

సూర్యాపేటలో రెండు కార్లు దగ్థం

సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరంలో రెండు కార్లు మంటల్లో కాలిపోయాయి. నేషనల్ హైవేపై రెండు కార్లు ఢీ కొనడంతో మంటలు వ్యాపించాయి. హైదరాబాద్  నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి.. మునగాల నుంచి హైదరాబాద్  వైపు వెళ్తున్న కారును డివైడర్  దాటి ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లూ పూర్తిగా దగ్ధమాయ్యయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు స్వల్పంగా గాయపడ్డాడు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు పోలీసులు.