చైన్ స్నాచర్ల అరెస్ట్.. సొత్తు రికవరి

 చైన్ స్నాచర్ల అరెస్ట్.. సొత్తు రికవరి

హైదరాబాద్: మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. మీర్ పేట్ లో ఈ నెల 26న చైన్ స్నాచింగ్ కు పాల్పడిన నిందితులని గుర్తించారు. నిందితులు నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన కిరణ్, రంగారెడ్డి జిల్లా కడ్తాల్ కు చెందిన నరేంద్రగా గుర్తించారు. వీరి నుంచి మూడు తులాల బంగారం, బైక్, రెండు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.