జమ్మికుంట, వెలుగు: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని నాగంపేట గ్రామం వద్ద ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ వద్ద ఇసుక అక్రమ రవాణాకు సహకరించిన ఇద్దరు కానిస్టేబుల్స్‌ను సీపీ గౌష్ ఆలం సస్పెండ్ చేసినట్లు సమాచారం. నాగంపేట చెక్‌పోస్ట్ వద్ద ఇద్దరు కానిస్టేబుల్స్ విధుల్లో ఉన్నారు.
ఈ సమయంలో సుమారు 40 ఇసుక ట్రాక్టర్లు ఎలాంటి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నా వీరు వాటిని అడ్డగించలేదు. పైగా ట్రాక్టర్‌కు రూ.200 చొప్పున వసూలు చేయడంపై స్థానికులు కొందరు వీడియో తీసి సీపీకి పంపించారు. ఆరా తీసిన సీపీ ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
