అక్టోబర్ 31న టీఐఈ ఎంటర్ప్రెన్యూర్ షిప్పై సమ్మిట్

అక్టోబర్ 31న  టీఐఈ ఎంటర్ప్రెన్యూర్ షిప్పై సమ్మిట్
  • ఎంటర్​ప్రెన్యూర్ ​షిప్​పై సమ్మిట్​ప్రకటించిన టీఐఈ

హైదరాబాద్, వెలుగు: ఎంటర్​ప్రెన్యూర్స్​ గ్లోబల్​ కమ్యూనిటీ అయిన టీఐఈ హైదరాబాద్​ఈ నెల 31, వచ్చే నెల ఒకటో తేదీల్లో ఎంటర్​ప్రెన్యూర్​షిప్​  సమ్మిట్ నిర్వహించనుంది. హైదరాబాద్​లోని హైటెక్స్​లో దీనిని ఏర్పాటు చేయనుంది. సమ్మిట్​లో గ్లోబల్​ వెంచర్​ క్యాపిటల్​ (వీసీ) సంస్థలు, ఏంజిల్ ఇన్వెస్టర్లు పాల్గొంటారు. పిచ్​ పోటీల ద్వారా స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తమ ఆలోచనలను వారికి నేరుగా ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. స్టార్టప్ ఎక్స్​పో ద్వారా నిధులు సేకరించవచ్చు.

1,500 మందికి పైగా వ్యవస్థాపకులు, పారిశ్రామిక నాయకులు, పాలసీ మేకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒకే చోట కలుస్తారు. స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు కీలకమైన భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి, తమ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు పెంచుకోవడానికి సమ్మిట్​సహాయపడుతుంది.  హైదరాబాద్ 2035 విజన్​పై కీనోట్​లు, టీఐఈ​ 50 అవార్డులు, స్టార్టప్​ ఎక్స్​పో వంటివి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. 

 గత ఏడాది హైదరాబాద్​ టెక్​ స్టార్టప్​లకు ఫండింగ్​ 160 శాతం పెరిగి  571 మిలియన్ డాలర్లకు చేరిందని, నగరం ఏఐ​, డీప్​ టెక్​, ఫిన్​టెక్, హెల్త్​టెక్​ రంగాల్లో ఎదుగుగుతోందని టీఐఈ ప్రెసిడెంట్ ​పగడాల రాజేశ్​ చెప్పారు.