
సూర్యాపేట కలెక్టరేట్, వెలుగు: కరోనా నేపథ్యంలో రాత్రి, పగలు తేడా లేకుండా డ్యూటీ చేసిన పోలీసులకు ఇప్పుడు కాస్త రెస్ట్దొరకనుంది. డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాల ప్రకారం పోలీసు సిబ్బంది అందరికి రొటేషన్ పద్ధతిలో రెండు రోజుల విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించారు. ప్రధానంగా లాక్డౌన్డ్యూటీలో ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో1230 మంది పోలీస్సిబ్బంది లాక్డౌన్డ్యూటీలు చేశారు. వీరందరికి ఈ నెల 24వ తేదీ వరకు 250 మంది చొప్పున 5 విడతల్లో రెండురోజుల విశ్రాంతి ఇవ్వనున్నారు.
సంతోషంగా ఉంది
రెండు నెలలు ఇంటికి దూరంగా డ్యూటీ చేశాం. పిల్లలతో గడిపే సమయం కూడా లేకుండా పోయింది. ఇలాంటి రోజులు మళ్లీ రావొద్దు. ఇప్పటికైనా ప్రభుత్వం మా సేవలు గుర్తించి రెండు రోజులు సెలవులు మంజూరు చేయడం సంతోషంగా ఉంది. – రమేశ్, కానిస్టేబుల్, సూర్యాపేట
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి