Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హౌస్‌లో హై టెన్షన్.. చివరి స్థానంలో ఎవరున్నారు?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హౌస్‌లో హై టెన్షన్.. చివరి స్థానంలో ఎవరున్నారు?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా 9 వారం కొనసాగుతోంది. ప్రతి వారం సరికొత్త ట్విస్టులు, సీక్రెట్ టాస్క్ లు, డ్రామాలు, నామినేషన్ లతో ఉత్కంఠను రేపుతోంది.  కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలు, ఉద్రిక్తతలతో హౌస్ లో మరింత వేడి పుట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఆదివారం ఎలిమినేషన్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్లలో ఎవరు బయటకు వెళ్తారనేది ప్రధాన చర్చనీయాంశమైంది.

9వ వారం ఎలిమినేషన్ గండం..

బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లు దివ్వెల మాధురి, రమ్య మోక్ష, నిఖిల్, గౌరవ్, సాయి శ్రీనివాస్, అయేషా  ఆటకు కొత్త రంగు అద్దారు. అయితే వీరిలో అయేషా, రమ్య మోక్ష ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. గత వారం ఊహించని విధంగా మాధురి హౌస్ నుండి బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఓటింగ్ తక్కువగా ఉండటం వల్లే ఎలిమినేట్ అయ్యిందని అంతా అనుకుంటుంటే.. తాను కావాలనే బయటకు వచ్చానని ఆమె చేసిన కామెంట్స్ మరింత చర్చకు దారితీశాయి. ఇప్పుడు మిగిలిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లపై ఎలిమినేషన్ గండం పడినట్లు తెలుస్తోంది.

సాయి శ్రీనివాస్‌కు షాక్ తప్పదా?

లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ వారం హౌస్ నుండి సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. హౌస్‌లో పెద్దగా చురుకుగా లేకపోవడం, టాస్క్‌లలో అతని ప్రభావం తక్కువగా ఉండటం,  నిశ్శబ్దంగా ఉండటం వంటి కారణాల వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో, ఓటింగ్ శాతం గణనీయంగా పడిపోయింది.

►ALSO READ | NTR: 'డ్రాగన్' కోసం ఇంత రిస్కా? ఆందోళన రేకెత్తిస్తున్న తారక్ లుక్!

ప్రస్తుతం అందుతున్న అనధికారిక ఓటింగ్ ట్రెండ్‌ల ప్రకారం.. సాయి శ్రీనివాస్, రాము రాథోడ్ చివరి రెండు స్థానాల్లో ఉన్నారు. రాము రాథోడ్ కొన్ని ఎమోషనల్ సంఘటనలు , వివాదాల ద్వారా కొంత కవరేజ్ పొందుతున్నారు. కానీ సాయి శ్రీనివాస్ మాత్రం ఆటలో వెనుకబడి ఉన్నాడు. ఓటింగ్‌కు ఇంకా రెండు రోజులు గడువు ఉన్నప్పటికీ, పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన మరో కంటెస్టెంట్ సాయి శ్రీనివాస్ బయటకు వెళ్లడం దాదాపు ఖాయంగా కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది.

ట్విస్టులు ఉంటాయా?

బిగ్ బాస్ హౌస్‌లో చివరి నిమిషంలో ఎప్పుడూ ఊహించని ట్విస్టులు ఉంటాయి. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను తొందరగా ఎలిమినేట్ చేయడం అనేది హౌస్‌మేట్స్‌కు లేదా ప్రేక్షకులకు పెద్ద షాక్ కాకపోవచ్చు. అయితే, బలమైన ఆటగాళ్లుగా ఉన్న ఇతర కంటెస్టెంట్ల కంటే తక్కువ ఓట్లు ఉన్న కంటెస్టెంట్ వెళ్లడం అనేది కచ్చితమైన ఎలిమినేషన్‌కు నిదర్శనం. సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ దాదాపు ఖాయం అనే ఇన్ సైడ్ టాక్ నిజమైతే, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్‌లో నిలదొక్కుకోవడానికి ఎంత కష్టపడాలో మరోసారి రుజువవుతుంది. 

చివరి రెండు రోజుల్లో ఓటింగ్ ట్రెండ్‌లు మారే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే, ఈ వారం సాయి శ్రీనివాస్ పయనం ఖాయంగా కనిపిస్తోంది. హౌస్‌లో మిగిలిన కంటెస్టెంట్లు వారి ఆట తీరును ఎలా మార్చుకుంటారు, రాబోయే రోజుల్లో బిగ్ బాస్ ఎలాంటి కొత్త ట్విస్ట్‌లు ఇస్తారనేది వేచి చూడాలి.