NTR: 'డ్రాగన్' కోసం ఇంత రిస్కా? ఆందోళన రేకెత్తిస్తున్న తారక్ లుక్!

NTR: 'డ్రాగన్' కోసం ఇంత రిస్కా? ఆందోళన రేకెత్తిస్తున్న తారక్ లుక్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం  'డ్రాగన్' (Dragon).  పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ శరవేశంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చేస్తున్న కసరత్తులు, శరీరంలో వచ్చిన అసాధారణమైన మార్పులు సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. మరోవైపు అభిమానుల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది.

కొత్త లుక్‌పై ఆందోళన..

ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత తారక్ శరీరాకృతితో చాలా మార్పులు వచ్చాయి. కేవలం ఐదు నెలల వ్యవధిలో ఏకంగా 18 కిలోల బరువు తగ్గారు. ఈ మార్పు 'డ్రాగన్ ' సినిమా కోసం అని టాక్ వినిపిస్తున్నా.. అభిమానులతో పాటు నెటిజన్లను ఆశ్చర్యాన్ని, ఆందోళనను గురిచేస్తోంది. ఎన్టీఆర్ మరింత లీన్ గా,  స్లిమ్ గా కనిపిస్తున్న చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలలో ఎన్టీఆర్ చాలా బలహీనంగా కనిపించడంతో అభిమానులు ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

 

సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఫ్యాన్స్...  బ్రో, మీ శరీరంపై మీరు చేస్తున్న ఈ ప్రయోగాలు చాలు. ఇక ఆపేయండి. మీరు చాలా సన్నగా , బలహీనంగా కనిపిస్తున్నారు. గతంలో 'టెంపర్', 'అరంవింద సమేత' మూవీస్ నాటి ఫిజిక్ ను తిరిగి పొందండి అని పోస్ట్ చేస్తున్నారు.  ఆయన పాత్ర కోసం బరువు తగ్గుతున్నారో లేదో తెలియదు కానీ .. నిజంగా బల్కప్ అవాల్సిన అవసరం ఉంది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మేము ఆరోగ్యంగా ఉన్న తారక్ ను చూసి అలవాటు పడ్డాం.. ఈ లుక్ మా కళ్లకు అసౌకర్యాన్ని కలిగిస్తోందని పోస్ట్ చేశారు. 

 

 పుకార్లకు చెక్ పెట్టిన కోచ్

అయితే కొంతమంది అభిమానులు ఈ వేగవంతమైన బరువు తగ్గింపు వెనుక, సెలబ్రిటీలలో ప్రసిద్ధి చెందిన 'ఓజెంపిక్' (Ozempic) అనే ఔషధ వినియోగం ఉండి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఎన్టీఆర్ ఫిట్‌నెస్ కోచ్ కుమార్ ఈ పుకార్లను సెప్టెంబర్‌లోనే ఖండించారు. ఎన్టీఆర్ వర్కౌట్ వీడియోను పంచుకున్నారు. సినిమా కోసం తారక్ అంకితభావం, కృషినే ఈ మార్పుకు కారణమని స్పష్టం చేశారు. 'దేవర' నుండి 'డ్రాగన్' వరకు ప్రతి సినిమాలో తన పాత్ర కోసం ఎన్టీఆర్ తన శరీరాకృతిని మలచుకోవడానికి తన పరిమితులను మించి కృషి చేస్తున్నారని కోచ్ కుమార్ వివరించారు. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ పూర్తిగా కఠినమైన ఆహారం, తీవ్రమైన వ్యాయామం ద్వారా సాధించారని తెలిపారు.

►ALSO READ | Twinkle Khanna: పెద్దవాళ్ళకే ప్రాక్టీస్ ఎక్కువ: అఫైర్స్‌పై టింకిల్ ఖన్నా సంచలనం వ్యాఖ్యలు!

భారీ బడ్జెట్ తో.. 

 ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో ఈ 'డ్రాగన్' మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో తారక్ పై ఓ వైల్డ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని సమాచారం. ఇందులో ఎన్టీఆర్ పూర్తిగా రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ లో కనిపించనున్నారు. దీని కోసమే ఎన్టీఆర్ కఠినమైన కసరత్తులు చేసి సన్నని లుక్ లోకి మారాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన  రుఖ్మిణీ వసంత్ కుమార్ నటిస్తోంది. వచ్చే ఏడాది జూన్ 25న ఈ మూవీనీ  ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండాగా.. టీ సిరీస్ ఫిల్మ్స్ సంస్థ సమర్పిస్తోంది....