బర్రెదూడకు బర్త్ డే..డీజేలు పెట్టి డ్యాన్సులు.. లక్షల్లో ఖర్చుపెట్టి పెద్ద దావత్ చేసిన్రు

బర్రెదూడకు బర్త్  డే..డీజేలు పెట్టి డ్యాన్సులు.. లక్షల్లో ఖర్చుపెట్టి పెద్ద దావత్ చేసిన్రు

పెంపుడు జంతువుపై తనకున్న ప్రేమను ఓ యజమాని వినూత్న రీతిలో  చాటుకున్నాడు.. తన పిల్లలకు చేసినట్లే  బర్త్​ డే  సెలబ్రేషన్స్​చేశాడు. గ్రామం మొత్తాన్ని పిలిచి విందులు వినోదాలతో ఎంజాయ్​ చేశారు.యూపీలో రెండేళ్ల  బర్రె దూడ పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్​ చేసిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి.. 

యూపీలోని సుంగర్ అనే గ్రామంలో షెరా అనే బర్రెదూడ(గేదె) రెండో బర్త్​ డే సెలబ్రేషన్స్​ ను ఓ రేంజ్​ లో జరిపించారు యజమాని. ఇది ఆ గ్రామంలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని రీతిలో గేదె పుట్టిన రోజు జరిపారు. 

షెరా యజమాని ఇస్రార్.. తన బర్రెదూడ పుట్టిన రోజును ఎప్పుడు గుర్తుండిపోయేలా నిర్వహించాలని డిసైడ్​ అయ్యాడు. బర్రెదూడను పూలతో అలంకరించారు. అందంగా రెడీ చేసి వేడుకల్లో స్టార్​ గా చూశారు. అంతేకాదు.. డీజేలు పెట్టి డ్యాన్సులు చేశారు. స్వీట్లు పంచుకొని గ్రామం మొత్తానికి విందు ఇచ్చ పండుగ వాతావరణం తీసుకొచ్చారు. 

షెరా బర్త్​ డేకు కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రామస్తులు DJ బీట్‌లకు డ్యాన్సులు చేయడం..షెరాతో సెల్ఫీలు ,ఫోటోలు తీసుకోవడం..అతనికి ట్రీట్‌లు తినిపించడం వీడియోలో కనిపిస్తోంది. ఇక పిల్లలు ,పెద్దలు ఇద్దరూ కలిసి పుట్టినరోజు గేదెతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతూ, పోజులిచ్చి ఆనందించారు.

ఎందుకు బర్రెదూడకు బర్త్​ డే సెలబ్రేషన్స్​.. 

స్థానికుల అభిప్రాయం ప్రకారం..షేరా ప్రశాంత స్వభావానికి, ఆకట్టుకునే శరీర ఆకృతికి ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది. షెరా పుట్టినరోజు వేడుకను గ్రాండ్​గా చేసి  జంతువు పట్ల ప్రేమ వ్యక్తపర్చాలకున్నాడు. అదే చేశాడు. 

ఈ వీడియో ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతూనే ఉంది. మనుషులు,జంతువుల మధ్య బంధాన్ని ప్రదర్శించే అరుదైన దృశ్యంగా నెటిజన్లు చాలా ఎంజాయ్​ చేస్తున్నారు. మరికొందరు ఈ అసాధారణ పుట్టినరోజు వేడుకను చూసి ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేస్తున్నారు.