రెండు డోసులు తీసుకుంటే ఆస్పత్రిలో చేరనక్కర్లే

రెండు డోసులు తీసుకుంటే ఆస్పత్రిలో చేరనక్కర్లే

చెన్నై: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. టీకా ఉత్పత్తి  కూడా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ప్రభావం ఎంతనే దానిపై ఇంకా పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. టీకా తీసుకుంటే మళ్లీ కరోనా రాదా, ఒకవేళ కొవిడ్ సోకినా దాని తీవ్రత ఎంత ఉంటుందనే దానిపై ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై వెల్లూరులోని సీఎంసీ కాలేజీ ఓ స్టడీ నిర్వహించింది. దీని ప్రకారం రెండు డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుంటే ఆస్పత్రిలో అడ్మిట్ కాకుండా 77 శాతం రక్షణ ఉంటుంది. ఐసీయూలో అడ్మిట్ కాకుండా 94 శాతం వరకు కాపాడుతుంది. టీకా రెండు డోసులను తీసుకుంటే కరోనా బారిన పడకుండా ఉండేలా 65 శాతం రక్షణ లభిస్తుంది. వెయ్యి మంది హెల్త్ కేర్ వర్కర్‌లపై ఈ స్టడీని చేపట్టారు. కొవిషీల్డ్ ఒక్క డోసు తీసుకుంటే ఐసీయూలో చేరకుండా 90 శాతం ప్రొటెక్షన్ దొరుకుతుందని, అందుకు అవసరమైన యాంటీ బాడీలను వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తుందని తేలింది.