జమ్మూకాశ్మీర్‍లో ఒక్కరోజు వ్యవధిలోనే.. రెండుసార్లు భూకంపం

జమ్మూకాశ్మీర్‍లో  ఒక్కరోజు వ్యవధిలోనే.. రెండుసార్లు భూకంపం

 ఉత్తర భారత దేశంలో ఒక్కరోజుకాల వ్యవధిలోనే మూడుసార్లు భూకంపం సంభవించింది. వరుస భూకంపాలతో ఆయా రాష్ట్రాల  ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలోనూ రిక్టర్ స్కేలుపై 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. మళ్లీ జమ్మూకాశ్మీర్ లోని కిష్త్వార్ లో  శనివారం మధ్యాహ్నం 2.53 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 3.8గా భూకంప తీవ్రత నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది.
 దీంతో వరుస భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భూ ప్రకంపనల కారణంగా ఆస్థి నష్టంపై వివరాలు ఇంకా అందనట్లు అధికారులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున 1.29 గంటల సమయంలో రాజస్థాన్ లోని పాలి జిల్లాలో భూప్రకంపనలు సంభవించాయి. భూకంపం తీవ్రత రిక్టర్  స్కేలుపై 5.4 గా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం ప్రకటించింది. పాలికి 15.8 కిమీ(10 మైళ్ళు) దూరంలో 10 కిమీ లోతులో భూకంప కేంద్రం ఏర్పడినట్లు తెలిపింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ఎలాంటి నష్టం జరగలేదని చెప్పింది.