
‘‘వెకేషన్‌కి వెళ్లాలని చాలామందికి ఉంటుంది? ఇష్టమైన ప్రదేశాలు చూస్తూ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలని ప్రతిఒక్కరూ కలలు కంటారు. మేం ఆ కలలను నిజం చేసుకుంటున్నాం” అని అన్నారు అంకిత, శరణ్య. అంకితకు చిన్నప్పట్నుంచే ట్రావెలింగ్ ఇష్టం. సోలో ట్రావెలర్ కూడా. కారవాన్ ఐడియా రావడానికి కారణం ఫ్రెండ్ రోహిత్. అతనో బైకర్. రెండేళ్లలో అమెరికాతోపాటు అనేక దేశాలు తిరిగాడు. ఆ దేశాల్లో ఎక్కడా చూసినా కారవాన్ కల్చర్ కనిపించింది. మన దేశానికి ఆ కల్చర్‌ను పరిచయం చేయాలనుకున్నాడు. అంకిత, రోహిత్ కలిసి టెంపో వెహికల్‌ను కొన్నారు. అందంగా రంగులద్ది కారవాన్‌లా తీర్చిదిద్దారు. అందులో బెడ్రూం, కిచెన్, మినీ వాటర్ ట్యాంకు.. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
వెబ్‌సిరీస్‌గా..
కేరళ, రాజస్థాన్, గుజరాత్, సిక్కిం రాష్ర్టాల్లో ఎన్నో ప్రాంతాలను చుట్టేశారు ఈ ముగ్గురు. ఎక్కడికెళ్లినా ఆ ప్రాంతాల విశేషాలు తెలుసుకోవడం, అక్కడి ప్రత్యేకతలపై దృష్టిపెట్టడం, ఆయా ప్రదేశాలను కెమెరాలో బంధించడం చేశారు. జర్నీ విశేషాలను కథలుగా రాసి బ్లాగులో పెట్టడంతో.. వీళ్ల జర్నీకి మంచి స్పందన వచ్చింది. ఆ విశేషాలు తెలుసుకొని ‘వాట్ ఈజ్ యువర్ నెక్ట్స్ ట్రిప్’ అంటూ నెటిజన్లు అభినందిస్తుంటారు. ‘‘ఇప్పటివరకు పర్యటించిన ప్రాంతాలు, ప్రత్యేకతల గురించి డాక్యుమెంటరీలు తీశారు. ఒక బిజినెస్‌మాన్ ప్రోత్సాహంతో జర్నీ విశేషాలన్నీ వెబ్‌సిరీస్‌గా మన ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ మిత్రబృందం.
కారవాన్ లైఫ్…
వంద రోజుల్లో ఎన్నో పట్టణాలు, గ్రామాలు తిరిగారు. ఉదయం నుంచి రాత్రి వరకు కారవాన్ ఎలా నడిపార అడిగితే.. ‘‘చూసేందుకు కారవాన్ అయినా.. మాకు ఇల్లులా ఉంటుంది. వెహికిల్ ఎక్కడ ఆగితే.. అదే మా ఊరు. ఈ ప్రయాణంలో ఎన్నో గ్రామాలు తిరిగాం. ఎంతోమందిని కలుసుకున్నాం. ప్రజల జీవన విధానం ఎలా ఉంది? వాళ్ల సంస్కృతి ఏంటి? అక్కడ చూడదగ్గ ప్రాంతాలేంటి? అనే విషయాలు తెలుసుకున్నాం. లోకల్వాళ్లు కూడా మాతో బాగా కలిసేవాళ్లు. స్థానిక ప్రాంతాల గురించి లిస్టు కూడా ఇచ్చారు”అని తమ జర్నీ గురించి వివరించారు.
100 రోజులు.. 14 రాష్ట్రాలు…
రెండేళ్ల క్రితం వీళ్ల జర్నీ మొదలైంది. కేరళ మొదలుకొని హిమాచల్‌ప్రదేశ్ వరకు… 14 రాష్ట్రాలు చుట్టొచ్చారు. రోహిత్ డ్రైవర్‌గా మారితే.. అంకిత తన కెమెరాతో అందమైన ప్రదేశాలను క్లిక్ చేస్తుంది. జర్నీలో ఎక్కడా బోర్ కొట్టకుండా ల్యాప్‌టాప్, బుక్స్ ఉంటాయి. రోహిత్ పాటలు వింటుంటే.. అంకిత బుక్స్ చదువుతూ జర్నీని ఎంజాయ్ చేస్తుంది. వీళ్ల ఆలోచన నచ్చి శరణ్య కూడా జతకూడింది. జర్నీ అనగానే ఒకే రోజు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు చాలామంది. కానీ ఈ మిత్రబృందం మాత్రం తీరిగ్గా ప్రయాణం చేసి ప్రదేశాల గురించి తెలుసుకున్నారు