హార్మూజ్ దాటిన రెండు భారత నౌకలు.. మరో కొద్ది రోజుల్లో స్వదేశానికి

హార్మూజ్ దాటిన రెండు భారత నౌకలు.. మరో కొద్ది రోజుల్లో స్వదేశానికి

టెహ్రాన్: జగ్ వసంత్, పైన్ గ్యాస్  ఎల్పీజీ నౌకలు హార్మూజ్  జలసంధిని దాటాయి. యూఏఈ తీరం నుంచి ఉత్తరం వైపు బయల్దేరిన నౌకలు.. సోమవారం తెల్లవారుజామున ఇరాన్​కు చెందిన షెష్మ్, లరక్  దీవులకు చేరుకున్నాయి. అక్కడి నుంచి హార్మూజ్​లోకి ప్రవేశించిన నౌకలు.. ఐఆర్ జీసీ అనుమతితో జలసంధిని దాటాయి. 

ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. త్వరలోనే షిప్పులు భారత్ కు చేరుకోనున్నాయి. ఈనెల ఆరంభంలోనే గల్ఫ్  తీరంలో బయల్దేరిన నౌకలు.. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రారంభించడంతో అక్కడే చిక్కుకున్నాయి.