చలి మంటలు అంటుకుని ఇద్దరికి గాయాలు..పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు

చలి మంటలు అంటుకుని ఇద్దరికి గాయాలు..పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు

జీడిమెట్ల, వెలుగు: చలి మంటలు అంటుకుని ఇద్దరికి ప్రమాదవశాత్తు గాయాలయ్యాయి. పేట్ బషీరాబాద్​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బిహార్​కు చెందిన ఎండీ నూర్​ ఆలం(36), అశ్రఫ్​ అలీ(27) గుండ్ల పోచంపల్లిలో ఉంటున్నారు. పెయింటింగ్​ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం రాత్రి చలి కాచుకుంటున్నారు. మంటలు ఎక్కువ రావడానికి తమ వద్ద ఉన్న టర్పెంట్​ఆయిల్​ను పోశారు. దీంతో మంటలు ఉవ్వెత్తున లేచి ఇద్దరికి అంటుకున్నాయి. పరిస్థితి విషమించడంతో  వారిని గాంధీ దవాఖానకు తరలించారు.