ఇద్దరు అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్

ఇద్దరు అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్

లగ్జరీ బస్సుల్లో ప్రయాణించే వారిని టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ర్ట దొంగలముఠా సభ్యులను అరెస్ట్ చేసిన సంఘటన రాచకొండ నేరెడ్ మెట్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏసీపీ శివకుమార్ కథనం ప్రకారం..ఫిబ్రవరి 6న నేరెడ్ మెట్ దీన్ దయాల్ ప్రాంతానికిచెందిన వెంకట రమణ అనే వ్యక్తి తన భార్యతోకలిసి రాజమండ్రి నుండి హైదరాబాద్ కు ప్రైవేట్లగ్జరీ బస్సులో బయల్దేరాడు. మరుసటి రోజు ఉదయం ఎల్బీనగర్ లో బస్సుదిగి నేరెడ్ మెట్ లోనితమ ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం వెంకటరమణ భార్య తన సూట్ కేసు ఓపెన్ చేసి చూడగా అందులోని 15 తులాల 8 గ్రాముల బంగారునగలు కనిపించలేదు. వెంటనే బాధితులు నేరెడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకుని రంగంలో దిగిన మల్కాజిగిరి ఎస్వోటీపోలీసులు, నేరెడ్ మెట్ పోలీసులు దర్యాప్తుముమ్మరం చేశారు.

దొరికారిలా..

మంగళవారం సికింద్రాబాద్ బస్ స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నఉత్తర్ ప్రదేశ్ లోని చుచెల్లకలన్ గ్రామానికి చెందినజావెద్ చౌదరి, మహ్మద్ జునాయిద్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరు విచారణలో భాగంగా తమనేరాలను ఒప్పుకున్నారు. వీరిద్దరూ షబ్బాన్ ఖాన్అనే మరో వ్యక్తి తో కలిసి కొంతకాలంగా లబ్జరీబస్సుల్లో ని ప్రయాణికులను దోచుకుంటు న్నట్లువెల్లడైంది. చెన ్నై, బెంగళూరు, విజయవాడ, రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు లగ్జరీ బస్సులనే టార్గెట్ చేసుకున్నట్లు తెలిపారు.చోరీ చే స్తారిలా..లగ్జరీ ఏసీ బస్సులలో ప్రయాణించే వారితోపాటుటికెట్లు కొని బస్సెక్కుతా రు. రాత్రి వేళ బస్సులో ప్రయాణించే వారికి బస్సులో సిబ్బం ది అందించేదుప్పట్ల సహాయంతో చీకట్లో సూట్ కేసులనుమాస్టర్ కీ తో తెరిచి అందులోని విలువైన సామగ్రిదోచేస్తారు. అనంతరం సూట్ కేసులను అదేస్థా నంలో పెట్టేసి గమ్యస్థా నం రాగానే దిగి వెళ్లి పోతుంటారు. జావెద్ చౌదరి, మహ్మద్ జునాయిద్లను అరెస్ట్ చేసి వారినుండి 9 తులాల బంగారునగలను స్వాదీనం చేసుకున్నారు పోలీసులు.పరారీలో ఉన్న షబ్బాన్ ఖాన్ కోసం గాలిస్తున్నామని ఏసీపీశివకుమార్ తెలిపారు. మల్కాజిగిరిఎస్వోటీ సీఐ నవీన్ కుమార్ , నేరెడ్ మెట్ డీఐరాజేందర్ గౌడ్ , ఎస్వోటీ ఎస్సై అవినాష్ లనుఏసీపీ అభినందించారు.