
జీడిమెట్ల, వెలుగు: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు ఇద్దరిని అరెస్ట్‌చేసినట్లు సీఐ నరసింహ తెలిపారు. ఆక్వా ఫీల్డ్‌లో పని చేసే నరసింహరాజు, హీరో హోండా షోరూంలో పని చేసే నాగేశ్వరరావు స్నేహితులు. ఐపీఎల్సీజన్ మొదలైన తర్వాత వీరు మహదేవపురంలోని ఓ గదిని అద్దెకు తీసుకొని, బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. జగద్గిరిగుట్ట పోలీసులు పక్కా సమాచారంతో బుధవారం దాడి చేసి, ఆ ఇద్దరినీ పట్టుకున్నారు.
ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు, రూ.3.60 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో పోలీస్‌శాఖలో హోంగార్డ్‌గా పని చేసిన నాగేశ్వరరావు 2019లో క్రికెట్ బెట్టింగ్కేసులో విజయవాడలో అరెస్టయి, జైలుకు వెళ్లొచ్చాడు. ఏపీలోని ఏలూరు జిల్లాకు చెందిన ఈ నిందితులిద్దరినీ అరెస్ట్‌చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.