విశాఖ ఏజెన్సీలో మందుపాతర పేలి ఇద్దరి మృతి

విశాఖ ఏజెన్సీలో మందుపాతర పేలి ఇద్దరి మృతి

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మందుపాతర పేలింది. పెదబయలు మండలం కొండ్రు సమీపంలో సోమవారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. మృతులను మొండిపల్లి మోహన్ రావు (26), మొండిపల్లి అజయ్ కుమార్ (20) గా గుర్తించారు. వీరు పెదబయలు మండలం చింతలవీధి గ్రామానికి చెందినవారు.

అయితే ఏజెన్సీ ప్రాంతంలో కొద్ది రోజులుగా మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. మావోలు తప్పించుకుని పారిపోయారు. మావో కీలక నేతలు తమ కాల్పుల్లో గాయపడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పోలుసులు లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఈ మందుపాతర అమర్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.