కేదార్‌నాథ్‌ లో దారుణం.. గుర్రంతో సిగరెట్ తాగిస్తూ.. ఆపై..

కేదార్‌నాథ్‌ లో దారుణం.. గుర్రంతో సిగరెట్ తాగిస్తూ.. ఆపై..

పొగతాగడం, మద్యం తాగడం, డ్రగ్స్ తీసుకోవడం హానికరమని అందరికీ తెలుసు. కాని కొంతమంది అలాంటి లెక్క చేయకుండా సిగరెట్లు తాగుతారు. వారు చెడిపోవడమే కాకుండా స్నేహితులకు కూడా అలవాటు చేసి చెడగొడతారు.  ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మూగ జీవాలకు కూడా ... సిగరెట్, డ్రగ్స్ పట్టిస్తున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. రాను రాను మనుషులు రాను రాను మృగాల కన్నా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు.. ..ఒక్కోసారి మనిషులు మూగ జీవాలపై దారుణాలకు ఒడి గడుతున్నారు. ఇలాంటి వారి చేష్ఠలు చూస్తుంటే మనుషుల కంటే , మనిషి కాదు మృగాలే నయం అనిపించే సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఒక మనిషి .. మూగజీవం పట్ల ఘోరంగా ప్రవర్తించిన ఘటన ఉత్తరాఖండ్లో వెలుగు చూసింది. కేదార్నాథ్ నడక మార్గంలో గుర్రానికి సిగరెట్లలో డ్రగ్స్ కలిపి బలవంతంగా ముక్కు ద్వారా ఎక్కిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అయింది.  

కేదార్‌నాథ్ ఆలయానికి వెళ్లే దారిలో ఇద్దరు వ్యక్తులు ఓ గుర్రాన్ని చిత్రహింసలు పెట్టారు. బలవంతంగా దానితో సిగరెట్ కాల్పించడానికి ప్రయత్నించారు. వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. ఇందులో ఓ గుర్రాన్ని ఇబ్బంది పెడుతూ బలవంతంగా గంజాయి,  సిగరెట్ కాల్పిస్తున్నారు. ఆశిష్ ప్రజాపతి (Ashish Prajapati) అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి షేరైన ఈ వీడియోపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎంతో మంది పర్యాటకులు తిరిగే ప్రాంతంలో ఈ రకంగా జంతు హింసకు పాల్పడటంపై పలువురు మండిపడుతున్నారు. గుర్రం నోరు, ముక్కు మూసి దానిని చిత్రవధకు గురి చేస్తూ ఆ ఇద్దరు వ్యక్తులు చేసిన చేష్టలు జంతు ప్రేమికులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

ఈ వీడియోపై ఉత్తరాఖండ్ పోలీసులు స్పందించారు. గుర్రంతో బలవంతంగా గంజాయి తాగిస్తున్న వీడియో చూశామని వీడియోలోని వ్యక్తుల్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు ఎవరి దృష్టికి వచ్చినా పోలీసు ఎమర్జెన్సీ నంబర్లలో తమకు తెలియజేయాలని కూడా పోలీసు శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇక ఈ వీడియో చూసినవారంతా జంతువులను హింసించడాన్ని వ్యతిరేకిస్తూ వారిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు

మండిపడుతున్న సంస్థలు

కేదార్‌నాథ్ ఆలయ పరిసరాల్లో జరుగుతున్న ఈ చర్యలపై జంతు ప్రేమికులు, జంతు సంరక్షణ సంస్థలు, నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. నోరు లేని మూగ జీవాలను హింసిస్తున్నారని మండిపడుతున్నారు. వైరల్ అయిన వీడియోలపై పీపుల్ ఫర్ యానిమల్ సంస్థ ప్రతినిధి గౌరీ మౌలేఖీ తీవ్రంగా స్పందించారు. గత సంవత్సరం కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని..ఇప్పుడు కూడా అదే జరుగుతోందని ఆమె మండిపడ్డారు. చనిపోయిన జంతువుల మృతదేహాలను నదుల్లో విసిరేస్తున్నారని.. బలహీనమైన, పనిచేయలేని జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పట్టించుకోని అధికారులు

కేదార్‌నాథ్ క్షేత్రంలో 2500 జంతువులకు అనుమతి ఉంటే.. కేవలం 1400 జంతువులతోనే పని చేయిస్తున్నారని ఆరోపించారు. గాడిదలు, గుర్రాలు అలసిపోయినా.. వాటికి మత్తు మందులు ఇచ్చి వాటితో పని చేయించి చనిపోయేలా హింసిస్తున్నారని తెలిపారు. దీనివల్ల గాడిదలు, గుర్రాల శక్తికి మించి 4 నుంచి 5 రెట్లు ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. వాటి సామర్థ్యం పెంచేందుకు మత్తు మందులు ఇస్తారు కానీ దానివల్ల జంతువుల అంతర్గత అవయవాలు దెబ్బతిని అనారోగ్యం పాలవుతాయి అన్న విషయాలు వారు పట్టించుకోరు. గాడిదలు, గుర్రాలకు ధూమపానం చేయిస్తున్న వీడియో ఉత్తరాఖండ్ పశుసంవర్థక శాఖ మంత్రి సౌరభ్ బహుగుణ దృష్టికి వెళ్లడంతో నిందితులను గుర్తించి కేసు నమోదు చేశామని తెలిపారు.

https://twitter.com/Aash_prajapati/status/1671959373231300616