మరో రెండ్రోజులు వానలు

మరో రెండ్రోజులు వానలు

హైదరాబాద్, వెలుగు: సిటీలో మరో రెండ్రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు  వానలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటల గ్రేటర్​లోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాన మొదలైంది. గాజులరామారంలో అత్యధికంగా 2.6 సెం.మీ, కుత్బుల్లాపూర్​లో అత్యల్పంగా1.6 సెం.మీల వాన పడింది. జీడిమెట్ల, అల్వాల్, షాపూర్​నగర్,మౌలాలి, కూకట్ పల్లి, సికింద్రాబాద్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.