జీటీ ఫోర్స్ కొత్త ఈవీలు.. గంటలోపే చార్జింగ్

జీటీ ఫోర్స్ కొత్త ఈవీలు.. గంటలోపే చార్జింగ్

జీటీ ఫోర్స్ సోల్ వెగాస్,  డ్రైవ్ ప్రొ పేరుతో రెండు లోస్పీడ్​ ఎలక్ట్రిక్​ వెహికల్స్​ను లాంచ్​చేసింది. జీటీ సోల్ వెగాస్ లెడ్-యాసిడ్ బ్యాటరీ వేరియంట్​ ధర రూ. 47,370 కాగా, లిథియం ఆయాన్​ వెర్షన్​కు రూ. 63,641. దీని మ్యాగ్జిమమ్ స్పీడ్​ గంటకు 25 కి.మీ. ఒక్కసారి చార్జ్​ చేస్తే లెడ్ -యాసిడ్ బండి 50--–60కి.మీ., లిథియమ్- ఆయాన్​ వేరియంట్ 60–--65 కి.మీ. మైలేజ్​ఇస్తాయి. జీటీ డ్రైవ్ ప్రొ ధరలు రూ. 67,208 (లెడ్-యాసిడ్)  రూ. 82,751 (లిథియమ్- ఆయాన్)లని కంపెనీ ప్రకటించింది. దీని మ్యాగ్జిమమ్ స్పీడ్​ కూడా గంటకు 25 కిలోమీటరు. గంటలోపే చార్జింగ్​ పూర్తవుతుందని కంపెనీ తెలిపింది.