ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ కొత్తగా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కువైట్ నుంచి వచ్చిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళకు, UAE నుంచి వచ్చిన విశాఖ వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది. మొత్తంగా ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4కు చేరింది. ఇక మహారాష్ట్రలో ఇవాళ 20 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు 108కు చేరాయి. అందులో 54 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
