ప్రజాపాలన అప్లికేషన్లపై నిర్లక్ష్యం.. ఇద్దరు అధికారులు సస్పెండ్

ప్రజాపాలన అప్లికేషన్లపై నిర్లక్ష్యం.. ఇద్దరు అధికారులు సస్పెండ్

ప్రజాపాలన దరఖాస్తులను నిర్లక్ష్యం చేసిన ఇద్దరు అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సస్పెండ్ చేశారు.  జనవరి 8న  బాలానగర్ లో డేటా ఎంట్రీ కోసం అభయహస్తం దరఖాస్తులను తరలిస్తుండగా రోడ్డుపై పడ్డాయి. ఈ ఘటనకు బాధ్యులైన హయత్ నగర్  సూపరింటెండెంట్ మహేందర్ ను సస్పెండ్ చేశారు.

మరో చోట కుత్బుల్లాపూర్ లోనూ అభయహస్తం దరఖాస్తులు  ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కనిపించడంతో సంబంధిత  అధికారిపై వేటు వేశారు. ప్రజలు..ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో అప్లికేషన్స్ పెట్టుకుంటే.. వాటిని జాగ్రత్తగా అప్లోడ్ చేయాలని కమిషనర్ హెచ్చరించారు. ఏ ఒక్క అప్లికేషన్ వదలకుండా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. అర్హులైన వారు అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని సూచించారు. 

ప్రజాపాలన దరఖాస్తులన ఆన్ లైన్ లో అప్లోడ్ చేస్తున్నారు.కోటి 25లక్షల అప్లికేషన్లను 30 వేల మంది జనవరి 30 వరకు ఆన్ లైన్ లో ఎంట్రీ 
చేయనున్నారు.