ఈ ఏడాది నా నుంచి మరో మూడు సినిమాలు రానున్నాయి

ఈ ఏడాది నా నుంచి మరో మూడు సినిమాలు రానున్నాయి

‘‘షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిల్మ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్ నుంచి నేను, గోపి కలిసి జర్నీ చేస్తున్నాం. ఇద్దరి ప్యాషన్ సినిమానే. ‘ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కళ్యాణమండపం’ చేయక ముందే ఈ సినిమా అనుకున్నాం. కానీ అది మొదట చేశాం. ఇంతవరకు ఎవరూ తీయని ఓ సింపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోరీ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చూపించాలని ఇది స్టార్ట్ చేశాం. సినిమా అంతా తెలియని ఓ ఫ్రెష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో ఇంట్లో ఆడవాళ్లు లేని లోటు తెలిసిన ఓ కుర్రాడు తన జీవితంలోకి ఎప్పుడెప్పుడు ఓ అమ్మాయి వస్తుందా అని ఎదురు చూస్తుంటాడు. ఆ మిడిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లాస్ అబ్బాయి ఒక సిటీ అమ్మాయితో లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పడితే ఎలా ఉంటుందనేది కాన్సెప్ట్. ఎమోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు సిట్యుయేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి తగ్గట్టు ఏడు పాటలున్నాయి. శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చంద్ర అద్భుతమైన సంగీతం ఇచ్చారు. చూడ్డానికి మూవీ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అనిపిస్తుంది కానీ నా క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే మాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. అదీకాక నేను ఎంత కాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లీ డ్రెస్ వేసినా మాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానే కనిపిస్తా. ఇక క్లైమాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెప్పిన పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కైతే అందరూ రిలేట్ అవుతారు. ఈ ఏడాది నా నుంచి మరో మూడు సినిమాలు రానున్నాయి. అన్నీ కమర్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్స్. ఆగస్టులో ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’, సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘వినరో భాగ్యము విష్ణుకథ’ విడుదల కానున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలిసి నిర్మిస్తున చిత్రం ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటుంది. అన్ని చిత్రాల టాకీ షూట్ పూర్తయ్యింది. జులైకి పాటల వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా కంప్లీటవుతుంది. ఇలా హీరోలు ఎక్కువ సినిమాలు చేస్తేనే, ఎక్కువమందికి పని దొరుకుతుందనేది నా ఫీలింగ్. అదే సమయంలో ప్రతి సినిమాకీ ఎక్కువ టైమ్, ఎఫర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టాలి. నేనదే చేస్తున్నా.’’