దిశ నిందితులకు సపోర్ట్‌ చేసిన ఇద్దరు అరెస్ట్

దిశ నిందితులకు సపోర్ట్‌ చేసిన ఇద్దరు అరెస్ట్

నల్లగొండ: దిశా ఘటనపై ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దిశకు వ్యతిరేకంగా.. నిందితులకు సపోర్ట్‌గా మట్లాడుతూ అసభ్యకరంగా కామెంట్స్ చేసిన అనిల్ కుమార్‌ను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనిల్ నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాపల్లి గ్రామానికి చెందిన వాడుగా పోలీసులు గుర్తించారు. అదే విధంగా దిశ కేసుకు సంబంధించి వ్యతిరేక పోస్టులు పెట్టిన శివ అలియాస్ శంఖు అనే యువకునిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శివ జగిత్యాలకు చెందిన వాడుగా పోలీసులు గుర్తించారు.

More News

విచారణలో గోప్యత.. ఘటనా స్థలానికి నేడు దిశ నిందితులు!
డాక్టర్ “దిశ” పై అభ్యంతరకర పోస్ట్ లు : స్మైలీ నాని అరెస్ట్
లోన్ ఇవ్వలేదని బ్యాంక్ మేనేజర్ పై దాడి