వడ్ల కొనుగోళ్లను స్పీడప్​ చేయాలి

వడ్ల కొనుగోళ్లను స్పీడప్​ చేయాలి

నర్సంపేట, వెలుగు :  వడ్ల కొనుగోళ్ల ప్రక్రియను స్పీడప్​ చేయాలని వరంగల్​కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా నర్సంపేట, ఖానాపురం, ఐనపల్లి కొనుగోలు కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోళ్ల ప్రక్రియను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వర్షాలు సమీపిస్తున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆమెవెంట ట్రైనీ ఐఎఫ్ఎస్ రేవంత్​చంద్ర, డీఆర్డీవో కౌంసల్యదేవి, సివిల్ సప్లయ్ ఆఫీసర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.