
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయనున్నట్లు చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ తెలిపారు. బీఆర్ఎస్ కు చెందిన నిట్టు జాహ్నవిపై అవిశ్వాసం నెగ్గిన తర్వాత శుక్రవారం ఇందుప్రియ అధ్యక్షతన తొలిసారి మున్సిపల్మీటింగ్నిర్వహించారు.
ఆయా వార్డుల్లోని సమస్యలను కౌన్సిలర్లు చైర్పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, అభివృద్ధి పనుల విషయంలో నిధుల కొరత లేకుండా చూస్తానని వెల్లడించారు. సమావేశంలో ఆఫీసర్లు, ఆయా వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.