డీఆర్డీఏ రికార్డు రూమ్​లో మంటలు..కాలిబూడిదైన పాత ఫైల్స్​

డీఆర్డీఏ రికార్డు రూమ్​లో మంటలు..కాలిబూడిదైన పాత ఫైల్స్​

నిజామాబాద్, వెలుగు : డిచ్​పల్లి మండలం ఘన్​పూర్​లోని డీఆర్డీఏ ఓల్ట్​ రికార్డు రూమ్​లో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వాచ్ మెన్ సమాచారంతో రెండు ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశాయి. అప్పటికే పాత ఫైళ్లన్నీ కాలి బూడిదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ రికార్డులను భద్రపర్చడానికి చాలా కాలంగా టీటీడీసీ(ట్రైనింగ్​ సెంటర్) లోని ఓ గదిని అధికారులు వాడుతున్నారు.

షార్ట్​సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు ఫైర్​ ఆఫీసర్​ నర్సింగ్​రావు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, కొత్త కలెక్టరేట్ బిల్డింగ్​లోకి డీఆర్డీఏ ఆఫీస్​ను షిఫ్ట్​ చేసిన అధికారులు.. డిచ్​పల్లిలోనే ఇంకా ఫైల్స్ ఎందుకు ఉంచారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.