గంజాయితో దొరికిపోయిన ఇద్దరు విద్యార్థులు

గంజాయితో దొరికిపోయిన ఇద్దరు విద్యార్థులు

నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం సృష్టించింది. శుక్రవారం రోజున గంజాయితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఇద్దరు విద్యార్థులపై ఎన్డీపీఎస్ చట్టం కింద బాసర పీఎస్ లో  కేసు నమోదు చేశారు. వారిని బైంసా మెజిస్ట్రేట్ ఎదుట  పోలీసులు హాజరుపర్చారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నుంచి గంజాయి సరఫరా అయినట్టు నిర్ధారించారు. కొందరు విద్యార్థులు గంజాయికి బానిసలు అవుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గంజాయి మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.