ఫేక్ డాక్యుమెంట్ల కేసులో ఇద్దరు అరెస్ట్ పరారీలో మరొకరు

ఫేక్ డాక్యుమెంట్ల కేసులో ఇద్దరు అరెస్ట్ పరారీలో మరొకరు

  కీసర వెలుగు : ఫేక్ డాక్యుమెంట్లతో ప్లాట్లు అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్ అయ్యారు. మరొకరు పరారీలో ఉన్నారు.  కీసర పోలీసులు తెలిపిన ప్రకారం..  యాదాద్రి జిల్లా రాజాపేట మండలం రేణిగుంటకు చెందిన సత్తు మహేశ్​(35), కీసర మండలం బండ్లగూడ ఐకామ్ కంపెనీ వద్ద ఉండే వీరభద్ర రావు, పాషా భాయ్ కలిసి  గోధుమకుంట పరిధిలోని టీపీఎస్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వెంచర్ ఫేస్ త్రీ  సర్వే నంబర్ 157,163,164,165,167లోని ప్లాట్ల నంబర్లు 57,58లోని 533.2 గజాల స్థలం కొట్టేసేందుకు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారు.  అమాయక ప్రజలకు అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా.. ప్లాట్ ఓనర్ల ఫిర్యాదుతో కీసర పోలీసులు మహేష్ ను గురువారం అరెస్ట్ చేశారు. వీరభద్రరావును అప్పటికే అరెస్ట్ చేయగా.. పాషా భాయ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.